సెల్ఐటి న్యూస్,అమరావతి: తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన యువనేస్తం పోస్టర్ను శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని ప్రజావేదిక హాల్లో విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ వారి కష్టాలను గుర్తించి వారి బాగు కోసం నిరంతరం కృషి చేస్తూ నిరుద్యోగుల కళ్లలో ఆనందానికి ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభించారని టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు కొనియాడారు. అదే విధంగా నిరుద్యోగుల కొరకు 20 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి ఇచ్చారు. ప్రతి నిరుద్యోగి ఈ చర్య పట్ల ఆనందంగా ఉన్నారు. యువనేస్తం పథకంపైన యువతలో అవగాహన కొరకు రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మం ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో యువనేస్తం అవగాహన సభలు అలాగే ముఖ్యమంత్రికి అభినందన సభలు ఈ నెల 24 నుండి అక్టోబరు 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రికి తెలిపారు. నవంబరు 3వ వారంలో అమరావతిలో ముఖ్యమంత్రి అభినందన సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు ఏ.రాజేష్, డి.ఎస్.శేషు, వెంకటప్ప భాస్కర యాదవ్, సాకిరి చైతన్య, ఆనంద గౌడ్, చైతన్య ప్రకాష్, ప్రణయ్, రిషి, వెంకటేశ్వరరావు, ధర్మేంద్ర, తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.
సెల్ఐటి న్యూస్, అమరావతి: శాసన మండలి సభ్యత్వా(ఎమ్మెల్సీ)నికి వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం రాజీనామా Read more →
సెల్ఐటి న్యూస్, బిజినెస్ డెస్క్: విజయవాడలో అతిపెద్ద టైల్స్ శానిటరి షోరూం నగరవాసులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు షోరూం యజమాని ఎండి Read more →