Published On: Tue, Sep 12th, 2017

యూరియా అధిక రేట్ల‌కు విక్ర‌యిస్తే క్రిమిన‌ల్ కేసులు

* అధికారుల‌కు కృష్ణా క‌లెక్ట‌ర్ ఆదేశం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కృష్ణా జిల్లాలో యూరియా అధిక రేట్లకు విక్రయించే వారిపై క్రివినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టరు బి.లక్ష్మికాంతం అధికారులను ఆదేశించారు. సోమవారం విజయవాడలో జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయం నుండి కలెక్టరు ల‌క్ష్మీకాంతం జిల్లా, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. వ్యవసాయ శాఖ అన్ని ప్రగతి సూచికలలో మొదటి స్థానంలో ఉందని ఆయినప్పటికి కొన్ని లోపాలు గమనించడం జరిగిందని, లోటుపాట్లు సవరించాలని వ్యవసాయాధికారులకు సూచించారు. చాలా మండలాల్లో పాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ కాలేదని, పాయిల్ హెల్త్ కార్డులు కౌలు రైతుల రుణ అర్హత కార్డుల పట్ల సరైన అవగాహన లేదని, యూరియూ అధిక రేట్లకు అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కాబట్టి వీటిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. సంక్షేమ శాఖలకు సంబంధించి ఆన్ని ప్రగతి సూచికలు మొదటి స్థానంలో ఉండాలని అన్నారు. జిల్లాలో ఎంఆర్ వ్యాక్సిన్ 99.98 శాతం ఆవులు – కలెక్టర్ – కృష్ణాజిల్లాలో 949 లక్షల మంది 5-15 సం. రాల మధ్య వయస్సు గల వారికి ఎంఆర్ వ్యాక్సిన్ వేయడం జరిగిందని, 9998 శాతం లక్ష్య సాధన చేయడం జరిగిందని కలెక్టరు తెలిపారు. జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, కిశోర్ బాలింతలకు రెండవ రౌండ్ హిమోగ్లోబిన్ పరీక్షలు చేయించాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనార్టీ లబ్దిదారులకు యూనిట్లు గ్రౌండింగ్ అంశంలో తక్కువ ప్రగతి సాధించిన బ్యాంకుల పనితీరుపట్ల జిల్లా కలెక్టరు ఆసహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయా బ్యాంకుల చైర్మన్లకు డివో లేఖలు వ్రాస్తామన్నారు, రైతులకు పంట రుణాలు పంపిణీ వేగవంతం చేయాలని పంట రుణాలు పొందిన రైతులు ఆందరిని పంటల భీమా పధకంలో నమోదు చేయించాలన్నారు. నీరు – ప్రగతిలో 10 ప్రగతి సూచికలలో 7 సూచికలకు ఎ గ్రేడ్ వచ్చిందని, ఎన్టిఆర్ జలసిరి వేగవంతం చేయాలని అన్నారు. మీ కోసం, జన్మభూమి, పరిష్కర వేదిక, 1100, ఎలర్ట్ మెనేజ్ మెంటు సిస్టం అర్టీలు నూరు శాతం పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులకు కలెక్టరు సూచించారు.

collector_11-09-17

Just In...