Published On: Fri, Nov 27th, 2020

రమేష్‌బాబు విచారణకు హైకోర్టు అనుమతి

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్ సెంటర్ అగ్ని ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న డాక్టర్ రమేష్‌బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతిచ్చింది. అతర‌మేష్‌బాబును కస్టడియల్ విచారణకు అనుమతిని మంజూరు చేస్తూ న్యాయస్థానం శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో నిందితుడుని అదుపులోకి తీసుకోనున్న ఆంధ్రప్రదేశ్‌ పొలీసులు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు విచారించనున్నారు. రమేష్‌బాబు న్యాయవాది పర్య‌వేక్షణలో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది.

 

Just In...