Published On: Wed, Jul 1st, 2020

రాజకీయంగా ఎదుర్కోలేకే చంపేశారు…

‌* మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, సెల్ఐటి న్యూస్‌: తన ముఖ్య అనుచరుడు మోకా భాస్కర్‌రావును కత్తితో పొడిచి హత్య చేసిన ఘటనపై మంత్రి పేర్ని నాని స్పందించారు. ఇదో రాజకీయ హత్య అన్నారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకే కిరాయి మనుషులతో చంపించారని వ్యాఖ్యానించారు. హత్యకు మూడు రోజులపాటు రెక్కీ నిర్వహించారని భావిస్తున్నామన్నారు. ఘటనపై తనతో, ఎస్పీతో సీఎం జగన్‌ ఫోన్లో మాట్లాడారని మంత్రి చెప్పారు. మరోవైపు, భాస్కర్‌రావు హత్యపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ రవీంద్రబాబు తెలిపారు. నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్టు ఆయన వెల్లడించారు.

Just In...