Published On: Tue, Jun 11th, 2019

రాజకీయ దాడులు మంచివి కావు

* ఏపీ హోం మంత్రి సుచరిత

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న రాజకీయ దాడులను ఏపీ హోం మంత్రి సుచరిత ఖండించారు. ఇలాంటి దాడులు వ్యవస్థకు మంచివి కావని పేర్కొంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో హోం మంత్రితో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగ‌ళ‌వారం భేటీ అయ్యారు. డీజీపీ గౌతం సవాంగ్‌, డీఐజీ ఆర్పీ మీనా హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసుల సంక్షేమం సహా వివిధ అంశాలపై హోం మంత్రితో డీజీపీ చర్చించారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడుతూ..పోలీసుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. సీఎం జగన్‌ ఆలోచన మేరకు పోలీసులకు 24 గంటల పనిభారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

Just In...