Published On: Mon, Apr 15th, 2019

రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జరిగిన ఏపి ఎన్నికలను రద్దు చేయాలి

* న్యాయ విచారణకు ఆదేశిస్తే నిజాలు వెల్లడవుతాయి

* మాజీ మంత్రి శైలజానాధ్ 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగా స్ఫూర్తికి విరుద్దంగా జరిగాయని, ఎన్నికల కమిషన్ విఫలమైందని అందుకు ఈ ఎన్నికలను రద్దు చేయాలని మాజీ మంత్రి, ఏపిసిసి కాంగ్రెస్ నేత డాక్ట‌ర్ శైల‌జానాధ్ డిమాండ్ చేశారు. విజయవాడ ఆంధ్రరత్నభవన్‌లో సోమవారం ఆయ‌న విలేఖరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో పూర్తి అధికారాలు కమిషన్‌కు ఉంటాయని, ఆ కాలమంతా ఒక నియమం, నిబద్దతతో ఎన్నికలు జరగడం ప్రజాస్వామ్య విధానమన్నారు. ఎన్నో ప్రగల్భాలు పలికిన కమిషన్, కమిషనర్ ఆచరణలో విఫలమైయ్యారన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ కోట్లలో జరిగిందని, దొరికిందని ప్రసారమాధ్యమాలు చెబుతున్నాయి. అలాగే ప్రజలు, రాజకీయ నాయకులు కూడా చర్చించుకుంటున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా డబ్బుల పంపిణీ జరిగిందని వార్తలు వస్తే ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అభ్యర్ధి ప్రచార ఖర్చు రూ.10 ఎక్కువైతే ప్రశ్నించే ఈసీ కోట్లు ఖర్చయినా ఎందుకు పట్టించుకోలేదన్నారు. ఎన్నికల కమిషన్ కేవలం పేపర్ పులి మాత్రమేనా అని ఎద్దేవాచేశారు. అలాగే ఎన్నికల అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ద్వివేది తక్కువ భద్రతాబలగాలతో ఎన్నికలు బాగా నిర్వహించామని చెప్పడం సిగ్గు చేటన్నారు. ఆ రోజు జరిగిన హింసకాండను గుర్తు తెచ్చుకుంటే రక్షణ ఏర్పాట్లలో కమిషన్ విఫలమైందని తెలుస్తుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో నియమించిని భద్రతా సిబ్బంది లెక్కలు చూస్తే అర్థమవుతుందన్నారు. ఒక పోలీస్ అబ్జర్వర్ మాటల్లో పోలీస్ సిబ్బంది కేవలం టూర్ లాగా షికారుకు వెళ్లివచ్చారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వ్యాఖ్యానించడంలోని అసలు రహస్యం వెల్లడవుతుందన్నారు. అనేక ప్రాంతాల్లో జరిగిన హింసాకాండలోభాగంగా ముఖ్యంగా అనంతపురంజిల్లాలో ముగ్గురు హత్యకు గురైనారన్నారు. ఈ అంశం పై ఎన్నికలను ఎందుకు రద్దు చేయ్యకూడతో చెప్పాలని పేర్కొన్నారు. సాక్షాత్తూ ఎన్నికల కమిషనర్ ఓటు వేయ‌డానికి వెళితే ఈవీఎంలు మొరాయించడంతో వెనుతిరిగారని, దాదాపు 7, 8 శాతం ఈవీఎంలు పనిచేయ‌లేదన్నారు. అసలే ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి. దానికి తోడు పనిచేయకపోవడం మరింత అనుమానాలకు తావిచ్చినట్లు అయిందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2009,2014 ఎన్నికలను సాఫీగా జరిపించామన్నారు. మరి బీజేపీ అధికారంలో ఉన్న ఈ సారి ఎందుకు జరిపించలేకపోతోందన్నారు. అనేక అనుమానాల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు ప్రజాస్వామ్యం మీద ఉన్న నమ్మకం మీద జరగాలన్నారు. ఆనమ్మకం బీటలు వారినప్పుడు కమిషన్ వివరణ ఇవ్వాలన్నారు.దీనికి తోడు ఈవీఎంల పనితీరు మీద అనేక సవాళ్లు వస్తున్నాయని, దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కమిషన్‌కు ఉందన్నారు. ఆయా ప‌త్రిక‌ల్లో ఇష్టానుసారం వ‌చ్చిన వార్త‌త‌ల‌ను ఎన్నికల కమిషన్ ను చూడలేదని వ్యాఖ్యానించింది. భారత రాజ్యాంగ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఎన్నికలు కమిషన్ కు కనిపించలేదా అని ప్రశ్నించారు. న్యాయవిచారణ జరిపిస్తే అసలు నిజాలు వెల్లదవుతాయన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీ , అనైతిక కార్యాలు జరిగాయా అనేవి నిర్ధారణ అవుతాయన్నారు. అప్పుడైనా ఎన్నికలు రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించేందుకు మోదీ, ఆయన స్నేహితులు కంకణం కట్టుకున్నారన్నారు. కోర్టు జోక్యం చేసుకుంటే కాని యోగి ఆదిత్యానాథ్‌పై చర్యలు తీసుకునే పరిస్థితి ఈసీకి లేకపోవడం శోచనీయమన్నారు. నమో ఛానల్ ద్వారా దొడ్డిదారిన ఎపిసోడ్లు ప్రసారం చేస్తుంటే ఈసీ ఏం చేస్తుందన్నారు. అంబేడ్క‌ర్ కల్పించిన రాజ్యాంగ బద్ధమైన ఓటు హక్కు ద్వారా బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంద‌న్నారు. దానికి విరుద్దంగా జరిగిన ఈ ఎన్నికలను రద్దు చేయాలని, అప్పుడే ప్రజాస్వామ్య స్ఫూర్తి నిలబడుతుందని త‌త‌తెలిపారు. అనుమానం ఉంటే న్యాయ విచారణకు ఆదేశిస్తే నిజాలు బయటపడతాయన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ధనేకుల మురళీ మోహన్‌రావు పాల్గొన్నారు.

Just In...