Published On: Sat, Aug 8th, 2020

రామ క్ర‌తువులో పాల్గొన‌డం నా పూర్వ‌జ‌న్మ సుకృతం

* శైవ‌క్షేత్రం పీఠాధిప‌తి శివ స్వామి

* దుర్గ‌గుడి వ‌ద్ద ప్ర‌త్యేక పూజ‌లు

* ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన విశ్వ‌హిందు ప‌రిష‌త్ నేత‌లు, భ‌క్తులు

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: జ‌గ‌ద‌భిరాముడు.. మ‌ర్యాదాపురుషోత్త‌ముడు అయిన శ్రీరాముని క్ర‌తువులో త‌న‌కు అవ‌కాశం ల‌భించ‌డం జీవితంలో మ‌ర‌పురాని మ‌ధుర‌మైన సంఘ‌ట‌న అని శైవక్షేతం పీఠాధిప‌తి శివ స్వామి పేర్కొన్నారు. ఈ నెల 5న  యోద్య‌లో జ‌రిగిన రామ‌మందిరం నిర్మాణం భూమి పూజ కార్య‌క్ర‌మంలో పాల్గొని శుక్ర‌వారం విజ‌య‌వాడ‌కు విచ్చేసి‌న అనంత‌రం శివ స్వామి దుర్గ‌గుడి ఘాట్‌రోడ్డు వ‌ద్ద ఉన్న అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా శివస్వామికి విశ్వ‌హిందు ప‌రిష‌త్ న‌గ‌ర అధ్య‌క్షుడు సానా శ్రీనివాస్‌, న‌గ‌ర కార్య‌ద‌ర్శి పి.రాఘ‌వ‌రాజు, ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ అధ్య‌క్షుడు కొన‌క‌ళ్ల విద్యాధ‌ర‌రావు, విశ్వ‌హిందు ప‌రిష‌త్ రాష్ట్ర ప్ర‌చార కార్య‌ద‌ర్శి నాగ‌లింగం శివాజీ, శివ‌స్వామి భ‌క్తులు త‌దిత‌రులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. శివ‌స్వామి మాట్లాడుతూ 491సంవ‌త్స‌రాల హిందువుల చిర‌కాల వాంఛ నెర‌వేరింద‌ని ఆ క్ర‌తువులో త‌న‌కు అవ‌కాశం ల‌భించ‌డం పూర్వ‌జ‌న్మ‌సుకృత‌మ‌ని పేర్కొన్నారు. శంఖుస్థాప‌న మ‌హోత్స‌వంలో పాల్గొనడానికి గ‌డ‌చిన 20 ఏళ్లుగా తాను విశ్వ‌హిందు ప‌రిష‌త్‌లో చేసిన కృషికి ఫ‌లిత‌మేన‌ని వ్యాఖ్యానించారు. ఎన్న‌డూ చూడని విప‌త్క‌ర క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి నుండి దేశ ప్ర‌జ‌లంద‌రిని ర‌క్షించాల‌ని ఆ బాల‌రాముడిని వేడుకున్న‌ట్లు తెలిపారు.

Just In...