Published On: Wed, Nov 14th, 2018

రాయితీతో కూడిన వైద్యం అభినంద‌నీయం

* జేజే డెంటల్ హాస్పిటల్ ప్రారంభోత్స‌వంలో ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: అందరికీ అందుబాటులో ఉండే విధంగా జేజే దంత వైద్యశాల అందుబాటులో ఉంటుందని డిప్యూటీ సిఎం కేఈ కృష్ణమూర్తి అన్నారు. బుధవారం ఉద‌యం సూర్యరావుపేటలోని పుష్పా హోట‌ల్ స‌మీపంలో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో నిర్మించిప జేజే దంత వైద్యశాలను ఉప‌ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి ముఖ్య అతిధిగా విచ్చేసి లాంఛ‌నంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణ‌మూర్తి మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఈ దంత వైద్యశాల ఉంటుందని పేద, మద్య తరగతి వారికి రాయితీని కల్పించడం అభినందనీయమన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు మాట్లాడుతూ వ్యాపారమే కాకుండా సామజిక స్పృహతో ఈ దంత వైద్యశాలని అతిచిన్న వయస్సులోనే బొల్ల ఝాన్సీరాణి ప్రారంభించడం గొప్ప విష‌య‌మ‌ని ప్ర‌శంసించారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ దంత వైద్యశాలను సంప్రదించి ఆరోగ్యంతో ఉండాలని కోరారు. అనంతరం జేజే దంత వైద్యశాల నిర్వాహకులు ఝాన్సీరాణి మాట్లాడుతూ దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి అనారోగ్యాలు తలెత్తవని ఈ నవీన యుగంలో ఆహారపు అలవాట్లు వలన ప్రజలు దంతసమస్యల భారిన పడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ క‌నీసం ఆరు నెలలకోసారి దంత వైద్యశాలను సంప్రదించి సమస్యలు తలెత్తకుండా జాగ్రత వహించాలన్నారు. తమ వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని రకాల దంత సమస్యలకు ప్రత్యేక నిపుణులైన వైద్యులు ఉన్నారని పేద బడుగు, బలహీన వర్గాలకు ప్రత్యేక రాయితీని కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్య‌క్ర‌మంలో బందరు పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణ, కార్పొరేటర్లు త్రిమూర్తిరాజు, ప‌లువురు టీడీపీ నాయకులు, బొల్ల జితేంద్ర, బి.వెంకటేష్, జేజే దంత వైద్యశాల సభ్యులు పాల్గొన్నారు.

Just In...