Published On: Wed, Aug 7th, 2019

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో జగన్‌ భేటీ

సెల్ఐటి న్యూస్, దిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రెండో రోజు పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు ఆయనతో పాటు ఉన్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే. నవరత్నాల అమలులో సహకరించాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు.

Just In...