Published On: Sun, Jul 12th, 2020

రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌న్వ‌యం అవ‌స‌రం

* భద్రత, పరస్పర సహాయ సహకారాలుపై దక్షిణాది రాష్ట్రాల డీజీపీల కీలక సమావేశంలో నిర్ణ‌యం

* ఏపీ నుంచి వీసీలో పాల్గొన్న డీజీపీ గౌతం స‌వాంగ్‌

* స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోతో స‌త్ఫ‌లితాలు అని వెల్ల‌డి

* ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిక‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: దక్షిణాది రాష్ట్రాలు, పుదుచ్చేరి, లక్షద్వీప్ ద్వీపాల మధ్య పరస్పర సహాయ సహాయ సహకారాల తోపాటు నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై శ‌నివారం దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించడం జరిగింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలలో నెలకొన్న సమస్యల పైన సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. సమావేశంలో చర్చకు వచ్చిన ప్రధాన అంశాలు తీర ప్రాంత గస్తీ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిజం, ఉగ్రవాద కార్యకలాపాలు, మనుషుల అక్రమ రవాణా, ఇసుక మద్యం అక్రమ రవాణా నియంత్రణ, నాన్ బెయిలబుల్ వారంట్ల పొడిగింపు సహకారం, ఐ.సి.జే.ఎస్ (ఇంటె రాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం)తో పాటు కరోనా వైరస్ నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల మధ్య సమన్వయంపై ప్రధానంగా చర్చ జరిగింది.

టెర్రరిస్ట్ కార్య కలాపాలు
రాష్ట్రాల మధ్య సమన్వయం సాధించాలని, తమిళనాడు రాష్ట్రం నుంచి తప్పించుకు తిరుగుతున్న టెర్రరిస్ట్‌లను పట్టుకోవాలని నిర్ణయం.

ఫండమెంటల్ ఇజం..
(మావోయిజం): కేరళ, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో విస్తరిస్తున్న మావోయిస్టు కార్య కలాపాలను కట్టడి చేయాలని సమావేశం నిర్ణయం.

తీర ప్రాంత గస్తీ
దేశ భద్రతలో అత్యంత కీలకమైన తీర ప్రాంత గస్తీ, కోస్టల్ సెక్యూరిటీ, కోస్టల్ గార్డ్ బోట్ల నిర్వహణ కష్టంగా ఉన్నందున వాటి నిర్వహణకు కావల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వ నుండి కోరాలని దక్షిణాది రాష్టాల డీజీపీల నిర్ణయం.

డ్రగ్స్ & గంజాయి కట్టడి
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏర్పడిన తర్వాత 150 కేసులు బుక్ చేసి, 20 వేల కిలోల గంజాయి స్వాధీన పరచుకొన్నట్లు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడి. మాదక ద్రవ్యాల నియంత్రణ లో ఆంధ్రప్రదేశ్ పని తీరు పట్ల డీజీపీల సమావేశం సంతృప్తి.

మనుషుల అక్రమ రవాణా
ఉపాధి కల్పన పేరుతో అమాయకులైన యువతులు, మహిళలను మాయ మాటలతో అనంతపురం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి మరియు కృష్ణా జిల్లాల నుండి చెన్నై, కొల్‌క‌త నగరాలకు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని దానిని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు.

ఇసుక, మద్యం అక్రమ రవాణా నియంత్రణకు కఠిన చర్యలు: డీజీపీ గౌతమ్ సవాంగ్
ఆంధ్రప్రదేశ్ దేశ్ డిజిపి గౌతం సవాంగ్ మాట్లాడుతూ తమ రాష్ట్రంలో ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుచేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులతో కేవలం ఏడు వారాల వ్యవధిలోనే 20 వేల కేజీలకు పైగా గాంజను స్వాధీనం చేసుకున్నామని అంతేకాకుండా భారీ ఎత్తున అక్రమ మద్యం, అక్రమ ఇసుక నిలువలను స్వాధీనం చేసుకున్నామని అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ కి ఆనుకొని ఉన్న తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున మద్యం వివిధ మార్గాల్లో అక్రమంగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని దానిని పూర్తిస్థాయిలో కట్టడి చేసేందుకు తాము కఠిన చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్న డి‌జి‌పి గౌతం సవాంగ్. పైన పేర్కొన్న అంశాలతోపాటు అనేకమైన కీలక అంశాలు, నేరాలను అరికట్టేందుకు దక్షిణాది రాష్ట్రాల తిసుకోవాల్సిన భద్రత చర్యలు,సమాచార మార్పిడి, పరస్పర సహకరంపై వీడియో కాన్ఫరెన్స్ కొనసాగింది.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన డీజీపీలు మహేందర్ రెడ్డి (తెలంగాణ) లోక్‌నాథ్ బెహరా (కేరళ), జె.కె త్రిపాటి (తమిళ్ నాడు), ప్రవీణ్ సుద్ (కర్ణాటక)తో పాటు ఆ రాష్ట్రాలకు చెందిన సిఐడి, గ్రేహౌండ్స్, ఎస్‌ఐబి, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటలిజెన్స్, శాంతిభద్రతలు, పలువురు సీనియర్ ఐ.పి.ఎస్ అధికారులు పాల్గొన్నారు.

 

Just In...