Published On: Sat, Sep 28th, 2019

రాష్ట్ర‌మంతా అభివృద్ధి ప్ర‌స్ఫుటించాలి…

* పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ సమీక్ష

* మంత్రి బొత్స సహా ఉన్నతాధికారులు, అధికారులు హాజరు

* నగరాలు, మున్సిపాల్టీల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రణాళికలపై సుదీర్ఘ చర్చ

* తాగునీరు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, వ్యర్థ్యాల తొలగింపు, మురుగునీటి శుద్ధి,

* పర్యావరణ పరిరక్షణ ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ

* కొనసాగుతున్న ప్రాజెక్టులు, చేపట్టాల్సిన కొత్త పనులపై అధికారులతో సమీక్షించిన సీఎం

* మున్సిపల్‌ స్కూళ్లను అభివృద్ధి చేయడంపైనా సమీక్షించిన వైనం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్ర‌మంతా అభివృద్ధి ప్ర‌స్ఫుటించాల‌ని సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అన్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుక్ర‌వారం త‌న నివాసంలో సమీక్ష నిర్వ‌హించారు. మంత్రి బొత్స సహా ఉన్నతాధికారులు, అధికారులు స‌మీక్ష‌కు హాజర‌య్యారు. స్కూళ్ల అభివృద్ధి కార్యక్రమంలో మూడింట ఒక వంతు నగరాలు, మున్సిపాల్టీల స్కూళ్లను తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్రతి మున్సిపాల్టీలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, మురుగునీటి శుద్ధి ఉండాల‌ని పేర్కొన్నారు. సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌ మెంట్‌ ఉండాలి, ఇవన్నీ ఉండేలా ప్రతి మున్సిపాల్టీకి కార్యాచరణ సిద్ధం చేయాల‌ని సీఎం ఆదేశించారు. తాగునీటి పైపులైన్లు డ్రైనేజీతో సంబంధం లేకుండా చూసుకోవాలి. పట్టణాలు, నగరాల్లో వ్యర్థాల సేకరణ సరిగ్గా ఉండడంలేదన్న సీఎం ఆ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను పూర్తిగా వినియోగించుకోవాలి, ప్రతి ఇంటికి సంబంధించిన తాగునీరు, డ్రైనేజి, ఇళ్లు, కరెంటు, రేషన్‌ కార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ అనే వాటిపై గ్రామ, వార్డు సచివాలయాలు దృష్టిపెట్టాలి..ఏ సమస్య వచ్చినా.. వెంటనే వాటిని తీర్చేలా చూడాలి, ఏ విజ్ఞాపన వచ్చినా.. వాటిని అడ్రస్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

ఆదర్శ మున్సిపాల్టీలుగా తాడేపల్లి, మంగళగిరి…
* తాడేపల్లి, మంగళగిరి మోడల్‌ మున్సిపాల్టీలుగా తయారు చేయడంపై సమావేశంలో చర్చ
* భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, తాగునీటి వసతి, రోడ్ల అభివృద్ధికోసం ప్రతిపాదనలపై చర్చ
* ప్రస్తుతం ఉన్న వసతులు, పెంచాల్సిన సదుపాయాలపై చర్చ
* తాడేపల్లి, మంగళగిరుల్లో ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశం
* తాడేపల్లిలో కనీసం 15వేల ఇళ్లు ఇవ్వాలని సీఎం ఆదేశం
* కట్టే ఇళ్ల సముదాయాల వద్ద కనీస మౌలికసదుపాయాలకూ కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని అధికారులకు సీఎం ఆదేశం
* ఉగాది నాటికి అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం ఆదేశం
* అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, రోడ్లు, కరెంటు, వీధిలైట్లు.. ఇలా కనీస మౌలిక సదుపాయాలను కల్పించాలని సీఎం ఆదేశం
* తాడేపల్లి మున్సిపాల్టీలో 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశం
కృష్ణానది కట్టమీద, కరకట్ట లోపల, కాల్వ గట్ల మీద ఉంటున్న వారికి ఇళ్ల నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘ చర్చ
* వారికి శాశ్వతంగా సమస్య తీర్చాలని సీఎం ఆదేశాలు
* ఇళ్ల నిర్మాణం కింద ఇప్పుడు ఇస్తున్న సెంటున్నర కాకుండా కనీసం 2 సెంట్ల విస్తీర్ణంలో వీరికి ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న సీఎం
* ఎక్కడో దూరంగా కాకుండా వారు కోరుకున్న ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం
* పర్యావరణ పరిరక్షణ, నదీ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంతోపాటు వీటికారణంగా పేదలు, సామాన్యులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం
* ఉగాది నాటికి పట్టాలు ఇవ్వడమే కాకుండా మంచి డిజైన్లలో వారికి ఉచితంగా ఇళ్లు కట్టి ఇవ్వాలని సీఎం ఆదేశం
* వర్షాకాలంలో ముంబై, చెన్నై లాంటి నగరాల్లో ఏం జరుగుతుందో మనం చూస్తున్నామన్న సీఎం
* కొద్దిపాటి వర్షానికే ప్రజలు నరకయాతన పడుతున్నారన్న ముఖ్యమంత్రి
* నగరాల్లో ప్రజల జీవనం దుర్భరంగా మారుతోందన్న సీఎం, అలాంటి పరిస్థితిని తెచ్చుకోకూడదన్న సీఎం
* వరదనీరు ప్రవహించే మార్గాల్లో నిర్మాణాల కారణంగా పరిస్థితులు దుర్భరంగా మారుతాయి: సీఎం
* కాల్వలు, ప్రవాహాలకు అడ్డంగా నిర్మాణాలతో మనం సమస్యలను కొనితెచ్చుకున్నట్టే… : సీఎం
* పైగా వాటికి చట్టబద్ధత ఉండదూ, ఎప్పటికీ పట్టా కూడా రాదు, చట్టాలు దీనికి అంగీకరించవు.అందుకే నదీపరీవాహక ప్రాంతాలకు భంగం కాకుండా.. చూడాల్సిన బాధ్యత మనపై ఉంది: సీఎం
* పేదలు, సామాన్యుల పట్ల ఉదారంగా వ్యవహిరించి, వారికి కావాల్సిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేయండి, అవగాహన కలిగించండి: * ఇవికాకుండా ప్రభుత్వ భూముల్లో సుదీర్ఘకాలం ఇళ్లుకట్టి ఉంటున్నవారికి పట్టాలు మంజూరుచేయాలని కూడా సీఎం ఆదేశం
* బకింగ్‌ హాం కెనాల్‌ కాలుష్యంకాకుండా చూడాలన్న సీఎం
* కాల్వ గట్లపై చెట్లను బాగా పెంచాలన్న సీఎం
* విస్తారంగా చెట్లను పెంచాలని కూడా సీఎం ఆదేశం
* ఇంటర్నెట్‌ సదుపాయంకూడా కల్పించాలన్న సీఎం
* పేదలకు మంచి సౌకర్యాలు కల్పించడంద్వారానే ఆదర్శ మున్సిపాల్టీ సాధ్యం
* మున్సిపల్‌ ఆఫీసుల్లో లంచాల వ్యవస్థ లేకుండా ఏం చేయగలరు? అధికారులకు సీఎం ప్రశ్న
* ఏ పౌరుడూ, ఏ బిల్డరు కూడా లంచం ఇచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉండకూడదు

Just In...