Published On: Fri, Oct 9th, 2020

రాష్ట్ర‌వ్యాప్తంగా ర‌హదారుల మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టండి‌

* ర‌హ‌దారుల నిర్వ‌హ‌ణ ప‌క్కాగా ఉండాలి

* రూ.2168 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం జ‌గ‌న్‌

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలో ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుల‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు వెంట‌నే ప్రారంభించాల‌ని, రహదారుల నిర్వహణ పక్కాగా ఉండాలి. వాహనాల రద్దీని బట్టి ప్రయారిటీ ఇస్తూ రహదారులు బాగు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. రహదారులు–భవనాల శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో గురువారం సాయంత్రం సీఎం జగన్‌ సమీక్షించారు. మంత్రి ఎం.శంకరనారాయణ, ఆర్‌ అండ్‌ బి ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ప‌లువురు సీనియర్‌ అధికారులు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయస్‌ జగన్ మాట్లాడారు. వంతెనలు, అప్రోచ్‌ రహదారులు, ఆర్‌ఓబీలు వెంటనే పూర్తిచేయాలి. వీలైనంత త్వరిత‌గ‌తిన గా ఆయా రహదారులను ప్రజలకు అందుబాటులోకి తేవాలి. అన్ని మున్సిపాలిటీలలో కూడా రహదారుల విస్తరణ చేపట్టాలి. రాష్ట్ర రహదారులు, జిల్లాలలో ముఖ్య రహదారుల మరమ్మతు పనులకు అవసరమైన నిధులు రూ.2168 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిన సీఎం. రహదారులపై రాకపోకలు సజావుగా సాగేలా, గుంతలు వెంటనే
పూడ్చి, ప్యాచ్‌ వర్క్‌ చేపట్టాలి. ఆ మేరకు దాదాపు 3 వేల కి.మీ రహదారులపై ప్యాచ్‌ వర్క్‌ కోసం దాదాపు రూ.300 కోట్లు అవసరమవుతాయన్న అధికారులు.
వెంటనే ఆ నిధులు కూడా మంజూరు చేసి, పనులు మొదలయ్యేలా చూడాలన్న సీఎం. ఎన్‌డీబీ ఆర్థిక సహాయంతో చేపడుతున్న రహదారుల నిర్మాణానికి రెండు నెలల్లో రీటెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలు పెట్టాలని ఆదేశించిన సీఎం వైయస్‌ జగన్‌.

Just In...