Published On: Wed, Jan 13th, 2021

రాష్ట్ర ఆర్థిక అవ‌స‌రాల‌పై కేంద్రం సానుకూలం‌

* ఏపి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్ల‌డి

న్యూఢిల్లీ, సెల్ఐటి న్యూస్‌: కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల పై కేంద్ర ఆర్థిక మరియు వాణిజ్య వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్‌తో  రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చర్చించారు. మంగళవారం సాయంత్రం న్యూఢిల్లీ అక్బర్ రోడ్ లోని సహాయ మంత్రి నివాసంలో ఆయనను బుగ్గన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆంధ్ర భవన్ రెసిడెంట్ కమిషనర్ భావ్నా సక్సేనా (ఐపీఎస్), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్ ఎస్ రావత్ (ఐఏఎస్) పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అవసరాలు, ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న పరిస్థితులను సహాయ మంత్రికి బుగ్గన వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి కేంద్రం నుండి రావలసిన ఆర్థిక సహాయం, నిధులు  అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, పునరావాసం మరియు ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయడానికి నిధులు విడుదల చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై ఆయన సానుకూలంగా స్పందించారని బుగ్గన తెలిపారు.

Just In...