Published On: Tue, Nov 12th, 2019

రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సోమ‌వారం బహిరంగ లేఖ రాశారు. ఇసుకపై 14న చేపట్టే దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ప్రకృతి ప్రసాదించిన వరం ఇసుక అని చెప్పారు. ఇసుక అందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి కృత్రిమ కొరత సృష్టించారని విమర్శించారు. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని, 40 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ఆత్మహత్యలను అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. కృత్రిమ ఇసుక కొరతతో నిర్మాణ రంగం కుదేలైందని, ఇసుక కొరత నివారించి ఉచితంగా పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.10వేలకు లభించే లారీ ఇసుక ఇప్పుడు రూ.50 వేలు అయ్యిందన్నారు. ఇసుక కొరతకు వరదలే కారణమంటూ అబద్ధాలు చెబుతున్నారని, ఎగువ రాష్ట్రాల్లో కనిపించని ఇసుక కొరత ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు తరలించి రూ. కోట్లు దండుకుంటున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.

Just In...