Published On: Sat, Jul 6th, 2019

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త …

* 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఉత్తర్వులు జారీ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 27 శాతం మధ్యంతర భృతి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి ఐఆర్‌ వర్తించనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు మధ్యంతర భృతి ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు ఏపీ ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్‌ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి.

Just In...