Published On: Sat, Aug 10th, 2019

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణానికి శ్రీహరిపురం ఉద్యోగుల కాలనీగా నామకరణం…

* దసరా నాటికి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన
* ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అడ్డాల సుబ్బరాజు

సెల్ఐటి న్యూస్, విజయవాడ: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణానికి శ్రీహరిపురం ఉద్యోగుల కాలనీగా నామకరణం చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర సహాయ సహకార గృహ నిర్మాణ సంఘం అధ్యక్షుడు అడ్డాల సుబ్బరాజు అన్నారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం ఉదయం ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ తమ సొసైటీలో మొత్తం 3700 మంది సభ్యులతో నవ్యాంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద ఉద్యోగుల సొసైటీగా అవతరించిందని పేర్కొన్నారు. నూతన రాజధాని ప్రాంతానికి అతి దగ్గరలో కేతనకొండ వద్ద 78 ఎకరాల భూమిలో లేఅవుట్ వేసినట్లు తెలిపారు. ఈ లేఅవుట్ కు సంబంధించి సీఆర్డిఎ అప్రూవల్ తీసుకోనున్నట్లు తెలిపారు. దసరా నాటికి  ఉద్యోగుల గృహ సముదాయానికి రాష్ట్ర ముఖ్యమంత్రిచే శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. తొలి విడుతగా 800 మంది ఉద్యోగులకు గృహ సముదాయం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన అభివృద్ధి గురించి సభ్యులకు వివరించారు. 2020 ఫిబ్రవరి నాటికి తొలిదశ పనులు పూర్తిచేస్తామన్నారు. సమావేశంలో సంఘం జనరల్ సెక్రటరీ నాదెండ్ల విశ్వనాథనాయుడు, ఉపాధ్యక్షురాలు మన్నే శారద తదితరులు పాల్గొన్నారు.

Just In...