Published On: Sat, Sep 11th, 2021

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలి

* రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా

* అజ్మీర్ షరీఫ్ దర్గాలో పూల చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించిన ఉపముఖ్యమంత్రి

కడప, సెల్ఐటి న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పాలనలో ప్రజలు ఆరోగ్యంగా, ఆర్థికంగా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంకల్పం, ఆశయాలు సర్వం సిద్దించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా ఆకాంక్షించారు. ఈ మహత్తర కార్యంలో భాగస్వామ్యం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. శుక్రవారం మత సామరస్యానికి ప్రతీక అయిన రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ “సుఫీ సెయింట్ హజరత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి” పవిత్ర దర్గాను.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా సందర్శించి, పూల చద్దార్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. మతాలకు అతీతమైన అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించడం.. నా అదృష్టంగా భవిస్తున్నానన్నారు. మహిమాన్వితమయిన ఈ దర్గాకు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారంటే భక్తులకు ఈ పుణ్యస్థలంపై ఉన్న నమ్మకం, ప్రజల ఆదరణనే అన్నారు.
దేశానికే స్ఫూర్తి దాయకమైన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముస్లిం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు పరిచి.. ఆంధ్ర రాష్ట్ర ముస్లిం మైనారిటీ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ప్రత్యేకించి అందరికీ సమ న్యాయం అంటూ.. ఒక మైనారిటీ ఎమ్మెల్యేకి ఉపముఖ్యమంత్రి పదవిని అందించడం.. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు మొత్తం గర్వించదగ్గ విషయం అన్నారు. అలాంటి ఆదర్శ ముఖ్యమంత్రిపై ఆ భగవంతుడి దయ, ఆశీస్సులు, అనుగ్రహం ఎల్లవేళలా ఉంటాయన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికి ఉండాలని… భవిష్యత్ లో రాష్ట్ర ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించాలని.. కరోనా లాంటి విఫత్కర పరిస్థితులన్నీ సమసి.. రాష్ట్రం ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని.. రాష్ట్ర ప్రజలపై.. ఆ దైవాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని.. ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి వెంట.. ఆయన సోదరుడు ఎస్.బి.అహ్మద్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Just In...