Published On: Sat, Apr 14th, 2018

రాష్ట్ర ప్రయోజనాలను భాజపాకు తాకట్టు పెట్టిన జగన్‌

* ఎమ్మెల్యే బొండా ఉమా 

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ పొలిటిక‌ల్‌: ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను భాజపాకు తాకట్టుపెట్టారని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి దిల్లీలో ఉంటున్నారన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాలు పూర్తయితే వైకాపా చిరునామా గల్లంతవుతుందన్న భయం జగన్‌లో నెలకొందని పేర్కొన్నారు. జగన్‌ అమరావతికి అనుకూలమా, వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కాపు రిజర్వేషన్లపై వైకాపా అభిప్రాయం ఏంటన్నది జగన్‌ చెప్పాలన్నారు. పట్టిసీమను వ్యతిరేకించిన జగన్మోహన్‌రెడ్డి కృష్ణాడెల్టా రైతాంగానికి క్షమాపణ చెప్పి జిల్లాలోకి అడుగు పెట్టాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు డిమాండ్‌ చేశారు. జగన్‌ చేపట్టింది ప్రజాసంకల్పయాత్ర కాదని పదవీ సంకల్ప యాత్రగా పేర్కొన్నారు. మైలవరం నుంచి దేవినేని ఉమా పారిపోతారని.. వైకాపా నాయకులు అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, అసలు పెడన నుంచి పారిపోయిన వ్యక్తి జోగి రమేష్‌ అని ఎద్దేవా చేశారు.

Just In...