Published On: Sat, Oct 24th, 2020

రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ విజయ దశమి శుభాకాంక్షలు

అమ‌రావ‌తి‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని.. మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని సీఎం జ‌గ‌న్ ఆకాంక్షించారు. ఈ సంద‌ర్భంగా తెలుగు ప్రజలందరికీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.

 

Just In...