Published On: Tue, Feb 5th, 2019

రాష్ట్ర బ‌డ్జెట్ అంకెల గారడీనే

* సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రాష్ట్ర బడ్జెట్ ప్రసంగం చంద్రబాబు స్తోత్రంలా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమ‌ర్శించారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఇది మధ్యంతర బడ్జెటో లేక పూర్తిస్థాయి బడ్జెటో అర్థంకానట్లుగా ఉంద‌న్నారు. ఈ బడ్జెట్ రాబోయే ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా మారుతుంద‌ని వ్యాఖ్యానించారు. రూ.2.26 లక్షల కోట్ల బడ్జెట్‌లో కీలకరంగాలకు కేటాయింపులు సరిగా లేవ‌న్నారు. గత 5 ఏళ్లుగా రైతు రుణమాఫీ పూర్తిగా అమలుచేయని చంద్రబాబు, రైతులను మరోసారి మోసగించేందుకు అన్నదాత సుఖీభవ పధకాన్ని ప్రవేశపెట్టార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కుదించిన రైతు రుణమాఫీలో ఇంకా రూ.8,200 కోట్లను ఇవ్వలేద‌ని గుర్తుచేశారు. గత సెప్టెంబర్ నాటికి రైతుల అప్పులు రు.1.37 లక్షల కోట్లకు చేరాయ‌న్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు ఇళ్ళు మంజూరు కేవలం 4,099 కోట్ల రూపాయల కేటాయింపుతో ఎలా సాధ్యం. ఇది కేవలం  ఎన్నికల బడ్జెట్టే అన్నారు. అంకెల గారడీ తప్ప నిజంగా జన సంక్షేమం, అభివృద్ధికి సరైన మార్గాలు లేవ‌ని పేర్కొన్నారు. ప్రజలు తెలివైన వార‌ని.. ఇలాంటి మాయలను నమ్మర‌ని సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ వ్యాఖ్యానించారు.

Just In...