Published On: Sat, Apr 4th, 2020

రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు రూ.1000 పంపిణీ

* 2,39,159 మంది వాలంటీర్లతో పేదలకు సాయం అందచేత

* సాయంత్రం ఆరు గంటల వరకు 57.91 శాతం పంపిణీ

* సాయం అందనివారు దరఖాస్తు చేసుకుంటే…అర్హతలు పరిశీలించి మంజూరు

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాకౌ డౌన్ వల్ల దారిధ్ర్యరేఖకు దిగువన వున్న కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ప్రత్యేక సాయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని బియ్యంకార్డులు వున్న ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు అందించాలన్న ఆదేశాలతో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచే వాలంటీర్లు రంగంలోకి దిగారు. రాష్ట్రంలో మొత్తం 1,33,03,368 బియ్యం కార్డులు వున్నాయి. ఈ కార్డుదారులకు వెయ్యి రూపాయల సాయం చొప్పున మొత్తం రూ.1330,33,68,000 లను ప్రభుత్వం కేటాయించింది. విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రంలోని 15,001 సచివాలయాల ద్వారా మొత్తం 2,39,159 మంది వాలంటీర్లతో ఈ మొత్తాన్ని లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా సాయంత్రం ఆరు గంటల వరకు రాష్ట్రంలోని 57.91 శాతం మంది కార్డుదారులకు వెయ్యి రూపాయల సాయంను అందచేశారు.

(సాయంత్రం ఆరు గంటల వరకు పంపిణీ చేసిన సాయం వివరాలు…రూపాయల్లో…)…
జిల్లా బియ్యంకార్డులు మొత్తం నగదు చెల్లింపు శాతం
శ్రీకాకుళం 754214 754214000 494674 65.59
ప.గో.జిల్లా 1166755 1166755000 757058 64.89
కృష్ణా 1154074 1154074000 744066 64.89
కడప 722343 722343000 459003 63.54
విజయనగరం 650016 650016000 410670 63.18
తూ.గో.జిల్లా 1495791 1495791000 934778 62.49
అనంతపురం 1093645 1093645000 678945 62.08
కర్నూలు 1084689 1084689000 665930 61.30
నెల్లూరు 798175 798175000 460710 57.72
ప్రకాశం 893779 893779000 463190 51.82
చిత్తూరు 1017560 1017564000 525902 51.68
గుంటూరు 1321542 1321542000 661502 50.06
విశాఖ 1150785 1150785000 447586 38.89
మొత్తం 13303368 13303368000 7704014 57.91
బియ్యం కార్డుదారులతో పాటు దారిద్ర్యరేఖకు దిగువన వున్న పేదలకు ఈ సాయం అందకపోతే వారికి కూడా న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అర్హులైన వారు గ్రామ, వార్డు సచివాలయంలో ఈ ప్రత్యేక సాయం కోసం దరఖాస్తు చేసుకుంటే, అధికారులు పరిశీలించి వారికి కూడా వెయ్యి రూపాయలు అందచేయనున్నారు.

Just In...