Published On: Sat, Apr 20th, 2019

రాష్ట్ర సమాచార కేంద్రంలో పచ్చదనం-పరిశుభ్రత

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: రాష్ట్ర సమాచార కేంద్రం సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో సహాయ సంచాలకులు కె.సదారావు ఆధ్వర్యంలో సిబ్బంది పరిసరాలను శుభ్రం చేసి పచ్చదనం కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. విజ‌య‌వాడ‌లోని జలవనరుల శాఖ కార్యాలయాల సముదాయంలో గల రాష్ట్ర సమాచార కేంద్రంలో 3వ శనివారాన్ని పురస్కరించుకుని కార్యాలయంలో సిబ్బంది అందరూ కార్యాలయం మరియు అవరణలో శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రపరిచారు. ఈ సంద‌ర్భంగా సహాయ సంచాలకులు కె.సదారావు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని పచ్చదనంతో ఉన్నప్పుడు కార్యాలయంలో అధికారులు సిబ్బంది ఆరోగ్యంతో పాటు ఆహ్లాదకరంగా ఉంటారన్నారు. పరిశుభ్రత ఉన్నప్పడు సిబ్బంది మానసిక ఉత్సాహంతో విధులను సమర్ధవంతంగా చేయగలుగుతారన్నారు. అంకిత భావంతో శ్రమదానం చేసి కార్యాలయాన్ని పరిశుభ్రపరిచిన సిబ్బందిని ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌ అభినందించారు. కార్య‌క్ర‌మంలో ఎం.శ్రీనివాసరావు, జి.రాంబాబు, జె.వి.లక్ష్మీ, వి.వి.ప్రసాద్, బి.రాంబాబు, కె.వెంకటేశ్వరరావు, సురేష్, కె.గంగా భవానీ, యు.శ్రీనివాస్, ఎస్.యశోధ, పి.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Just In...