Published On: Tue, Oct 15th, 2019

రికార్డు స్థాయిలో దుర్గ‌మ్మకు ద‌స‌రా కానుక‌లు స‌మ‌ర్ప‌ణ‌…

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా శ‌ర‌న్న‌వ‌రాత్రుల‌కు విచ్చేసిన భ‌క్తులు జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు రికార్డు స్థాయిలో కానుక‌ల‌ను స‌మ‌ర్పించారు. సోమ‌వారం నాడు జ‌రిపిన హుండీల కానుక‌ల‌ను లెక్కించ‌గా తొలి రోజు హుండీ ఆదాయం రూ.2.85కోట్లు, ప‌సిడి ఆభ‌ర‌ణాలు 520 గ్రాములు, వెండి వ‌స్తువులు 14.200 కిలోగ్రాములు భ‌క్తులు అమ్మ‌వారికి కానుక‌ల రూపంలో స‌మ‌ర్పించారు. మ‌హామండ‌పంలో నిర్వ‌హించిన హుండీల ఆదాయం లెక్కింపు కార్య‌క్ర‌మాన్ని ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. మంగ‌ళ‌వారం కూడా హుండీల లెక్కింపు కొన‌సాగ‌నుంది.

Just In...