Published On: Thu, Jan 9th, 2020

రికార్డు స్థాయిలో మోపిదేవి స్వామి వారి హుండీ ఆదాయం

సెల్ఐటి న్యూస్‌, మోపిదేవి: కృష్ణాజిల్లా మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది . కార్తీక మాసం,  షష్ఠి కలిసి రావడంతో రికార్డు స్థాయిలో కార్తీకేయుని హుండి ఆదాయం పెరిగింది. మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానము నందు భక్తులు సమర్పించిన కానుకులు ( హుండీ లెక్కింపు )   ఈ రోజు ఆలయ అధికారులు గ్రామస్తులు సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు. స్వామి వారి ఆదాయం 73 రోజులు గాను రూ.53.37 లక్షలు న‌గ‌దు, బంగారం 0-32 గ్రాముల 400 మిల్లీ గ్రాములు , వెండి -2 కేజిల 850 గ్రాములు , నిత్యాన్నదాన పధకానికి రూ.99,336లు, 291 యుఎస్ డాల‌ర్లు స్వామివారికి భ‌క్తులు కానుక‌గా స‌మ‌ర్పించారు. కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి జీవీడీఎన్ లీలాకుమార్, బందరు డివిజన్ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్ట‌ర్ సుధాకర్ బాబు, సూపర్నెంట్ మధుసూదనరావు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Just In...