Published On: Fri, Jan 8th, 2021

రికార్డు స్థాయిలో సత్యదేవుని హుండీ ఆదాయం

* రూ.1.13కోట్లు కానుక‌లు స‌మ‌ర్పించిన భ‌క్తులు

అన్నవరం, సెల్ఐటి న్యూస్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం నాడు హుండీలోని కానుక‌ల‌ను లెక్కించారు. రూ.1.13కోట్లు న‌గ‌దు రూపంలోనూ, బంగారం 16 గ్రాముల 500 మిల్లీ గ్రాములు, వెండి 624 గ్రాములు, విదేశీ కరెన్సీ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ 400 డాలర్స్, యుఎస్‌ఎ 27 డాలర్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెంట్రల్ బ్యాంక్ 55, సౌదీ అరేబియా కరెన్సీ 10 వచ్చిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు.

Just In...