Published On: Wed, Sep 13th, 2017

రీహ‌బిటేష‌న్‌, రీ సెటిల్‌మెంట్ చ‌ట్టంపై అవ‌గాహ‌న‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నూత‌నంగా వ‌చ్చిన భూ సేక‌ర‌ణ‌కు సంబందించి రీహ‌బిటేష‌న్‌, రీ సెటిల్‌మెంట్ చ‌ట్టం పట్ల పూర్తి అవ‌గాహ‌న వుండే విధంగా రెవిన్యూ యంత్రాంగానికి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ గందం చంద్రుడు అన్నారు. మంగ‌ళ‌వారం జాయింట్ క‌లెక్ట‌రు త‌న క్యాంపు కార్యాల‌యంలో జిల్లాలోని నాలుగు డివిజ‌నల్ల రెవిన్యూ అధికారులు, కలెక్ట‌రేట్ సెక్ష‌న్ అధికారులుతో రీహ‌బిటేష‌న్‌, రీ సెటిల్‌మెంట్ చ‌ట్టం పట్ల పూర్తి అవ‌గ‌హ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జె.సి గంధం చంద్రుడు మాట్లాడుతూ వివిధ‌ అభివృద్ది కార్య‌క్ర‌మాల కోసం కేంద్ర రాష్ట్ర  ప్ర‌భుత్వాలు భూ సేక‌ర‌ణ చేస్తార‌న్నారు. ఇలాంటి స‌మయాల్లో భూములు కోల్పోతున్న వారికి చ‌ట్ట ప్ర‌కారం చెల్లించ‌వ‌ల‌సిన ప‌రిహ‌రం, పున‌రావసం పట్ల రెవిన్యూ అధికారులు అవ‌గ‌హ‌న క‌లిగి వుండాల‌న్నారు. ఈ చ‌ట్టంపై 13 జిల్లాల జాయింట్ క‌లెక్ట‌ర్ల స‌మావేశం బుధ‌వారం జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో రెవిన్యూ భూ సేక‌ర‌ణ‌కు సంబందించిన ప‌లు అంశాల‌ను జాయింట్ క‌లెక్ట‌రు గందం చంద్రుడు ఆర్.డి.వోల‌తో స‌మిక్షించారు. స‌మావేశంలో డి.ఆర్వో. సిహెచ్ రంగ‌య్య‌, ఆర్‌.డి.వోలు ఎం.చక్ర‌పాణి, పి.సాయిబాబా, ఎస్.హారిష్, స‌ర్వే ఎ.డి విజ‌య్‌కుమార్, సంబందింత అధికారులు పాల్గోన్నారు.

rehabitation_1

Just In...