Published On: Thu, Jul 9th, 2020

రూ.18 ల‌క్ష‌లు విలువైన ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

* ఆరుగురు నిందితులు అరెస్టు, రూ .9.97,500 నగదు స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్

విజయవాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: నగర పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఖైనీ అమ్మక దార్లపై ఉక్కుపాదం మోపి ఖైనీ అమ్మకాలను నియంత్రించడానికి విజయవాడ టాస్క్ఫోర్స్ వారి ఆధ్వర్యంలో విస్తృత దాడులు నిర్వహించడం జరుగుతుంది ఈ క్రమంలో భాగంగా ఖైనీ తరలిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకి రాబడిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏ.డి.సి.పి. డా.కె.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏ.సి.పి.లు టి.కనకరాజు, వి.ఎస్.ఎన్. వర్మ, ఇన్‌స్పెక్టర్ పి.కృష్ణమోహన్, ఎస్.ఐలు కె.శేషారెడ్డి, జి.శ్రీనివాసరావు మరియు వారి సిబ్బందితో గురువారం విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనీ, వై.వి.రావు ఎస్టేట్స్ రింగ్ సెంటర్ వద్ద ఎపి31టిడి 6237 నెంబరు గల లారీని తనిఖీలు నిర్వ‌హించారు. అక్రమంగా రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ నుండి విజయనగరం జిల్లా కొత్తవలస విజయవాడ మీదుగు ఖైనీ తరలిస్తున్న ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుండి సుమారు రూ.18ల‌క్ష‌లు విలువైన ఖైనీ ప్యాకెట్లు మరియు రూ. 9.97,500లు నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇనుకుల రవికుమార్(38), రాయగడ, ఒరిస్సా రాష్ట్రం . (సరుకు ఓనరు) 2) గేదెల సతీష్(30), ఏలూరు, తూర్పుగోదావరి జిల్లా, (బ్రోకరేజ్ చేస్తాడు) .ద్వారపూడి స్వామి నాయుడు(41), కొత్తవలస, విజయనగరం జిల్లా, (జి.ఎస్.టి. బిల్ పై లావాదేవీలు ఉరికి కృష్ణ(29), వెంకన్న పాలెం, విశాఖపట్నం జిల్లా, (లారీ ఓనరు) పైలా బంగారప్ప(36), వల్లూరు, విజయనగరం జిల్లా, (లారీ డ్రైవర్) .గోలకానీ కిరణ్(20), తగరపువలస, విజయనగరం జిల్లా, (లారీ క్లీనర్) విచారణలో… పై నిందితులలో ఒరిస్సా రాష్ట్రం, రాయగడ కు చెందిన ఇనుకుల రవికుమార్ గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత ఖైనీ వ్యాపారం చేస్తూ వాటిని విజయవాడ మీదుగా హైదరాబాద్ నుండి విజయనగరం జిల్లా కొత్తవలస పైవారి అందరితో కలిపి లారీలో మైదా పిండి లోడు ద్వారా తరలిస్తూ అధిక లాభార్జన గడిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ కమిషనర్ టాస్క్ఫోర్స్ వారికి రాబడిన సమాచారం మేరకు విజయవాడ, వై.ఎస్.ఆర్. కాలనీ, వై.వి.రావు ఎస్టేట్ రింగ్ వద్ద వాహనాల తనిఖీలలో తరలిస్తున్న కైనీ ప్యాకెట్లను మరియు ఆరుగురు నిందితులను అధుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఖైనీ తరలిస్తున్న లారీని గుర్తించి పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అభినందించారు.

Just In...