Published On: Fri, Mar 22nd, 2019

రూ.185కోట్లతో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు చర్యలు

* రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడండి

* పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు 

* తాగునీటికి ఇబ్బంది ఉండే 5784 ఆవాసాలకు ట్యాంకరుల ద్వారా నీటిసరఫరా

* కరువు జిల్లాల్లో వలసల నివారణకు తగిన ఉపాధి పనులు కల్పించండి

* డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రభలకుండా చర్యలు చేపట్టిండి

* ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుత వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా అవసరమైన ముందు జాగ్రత్త చర్యల తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ అధికారులను ఆదేశించారు. వేసవి కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం అమరావతి సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యల చేపట్టాలని ఆదేశించారు. నీటికి ఇబ్బంది ఉండే గ్రామాలు, ఆవాసాలను గుర్తించి అక్కడ ట్యాంకరుల ద్వారా అవసరమైన నీటిని సరఫరా చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పశువులకు కాడా ఎక్కడా తాగునీటికిగాని, పశుగ్రాసానికి గాని ఇబ్బంది రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను సిఎస్ పునేఠ ఆదేశించారు. తాగునీరు, పశుగ్రాసం కొరత కారణంగా రైతులు వారి పశువులను తెగనమ్ముకోకుండా పుశువులకు తగిన తాగునీరు, పశుగ్రాసం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు జిల్లాల్లో తగిన ఉపాధి లేక ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస పోకుండా అవసరమైన ఉపాధిని కల్పించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ ఆదేశించారు.
             రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమీషనర్ వరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళిక అమలుకు 185కోట్ల రూ.ల అంచనాతో వేసవి కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదనలు రూపొందించండం జరిగిందని వివరించారు.నీటి ఎద్దడికి ఇబ్బంది ఉండే 5784 ఆవాసాలను గుర్తించి అక్కడ ట్యాంకరుల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు ప్రత్యేక చర్యల తీసుకుంటున్నట్టు తెలిపారు.ఈనిధులతో వేసవి కార్యాచరణ ప్రణాళిక తక్షణ చర్యలు కింద నీటిఎద్దడి ఉండే ఆవాసాలకు ట్యాంకరుల ద్వారా నీటిని అందించేందుకు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ప్రస్తుతం ఉన్న బోరులను లోతు చేయడం, సమ్మర్ స్టోరేజి ట్యాంకులను పూర్తిగా నీటితో నింపడం,వివిధ ప్రవేట్ నీటి సోర్సులను అద్దెకు తీసుకుని తాగునీటి అవసరాలను తీర్చడం వంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఎస్ కు వివరించారు.అలాగే రాష్ట్రంలోని 110 పట్టణ ప్రాంతాల్లో వేసవి కార్యాచరణ ప్రణాళికను అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఇందుకుగాను 155కోట్ల రూ.లు అవసరమని రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్ సిఎస్ కు వివరించారు.
వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ వేసవి కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి గ్రామ,వార్డువారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం జరిగిందని తెలిపారు.వివిధ అంటువ్యాధులు ప్రభలకుండా తగిన నివారణ చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పెద్దఎత్తున అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటున్నాని చెప్పారు.అవసరమైన ఒఆర్ఎస్ ప్లాకెట్లను సబ్ సెంటర్,ఆషా,అంగన్ వాడీ వర్కర్ల స్థాయిలో కూడా అందుబాటులో ఉంచామని తెలిపారు.వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 6కరువు ప్రభావిత జిల్లాల్లో 50వేల హెక్టార్లలో పెసర,మినుము తదితర అపరాల సాగుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. ఉద్యానవన సాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి మాట్లాడుతూ కరువు జిల్లాల్లో కూరగాయల సాగులో నీటిఎద్దడి గల ప్రాంతాల్లో ట్యాంకరుల ద్వారా నీటిని అందించేందుకు కార్యాచరణ ప్రణాళికను అమలుచేయనున్నామని చెప్పారు. రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభి వృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మహాత్మాగాంధి జాతీయ ఉపాధిహామీ పధకం కింద 10వేల 600కోట్ల రూ.లు ఖర్చు చేయాల్సి ఉండగా ఇప్పటికే 8వేల 776 కోట్లు ఖర్చుచేసి ఉపాధి పనులు కల్పించడం జరిగిందని తెలిపారు.కరువు ప్రభావిత జిల్లాల్లో మరిన్ని ఉపాధి పనులు కల్పించడం ద్వారా కూలీల వలసల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ కరువు ప్రభావిత జిల్లాల్లో పశుగ్రాసం సరఫరాకు 54లక్షల 94వేల రూ.లు అవసరమని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని ప్రస్తుతం రోజుకు 192 నుండి 195 మిలియన్ యూనిట్ల విదుత్ డిమాండ్ ఉందని విద్యుత్ శాఖ అధికారులు సిఎస్ కు వివరించారు.
సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు డి సాంబశివరావు, ఆదిత్యానాధ్ దాస్, ముఖ్య కార్యదర్శులు ఎస్ఎస్ రావత్, యం.రవిచంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Just In...