Published On: Wed, Jul 10th, 2019

‘రూ.21 కోట్లు సాధించారు.. మీ ఎంపీలు చాలా గ్రేట్‌’

* సీఎం వైఎస్ జగన్‌పై ట్విట‌ర్‌లో తెదేపా ఎంపీ కేశినేని నాని వ్యంగ్యాస్త్రాలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) ట్విటర్‌లో బుధ‌వారం ఉద‌యం మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్‌లో రూ.21 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సాధించారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంత ఘనత సాధించిన జగన్, ఆయన 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ అంటూ ట్విట‌ర్‌లో ఆయ‌న వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.

Just In...