Published On: Sun, Feb 21st, 2021

రూ.238.15 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ కింద సేవలందిస్తున్న 640 నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు జనవరి 15 నాటికి  ఉన్న బిల్లులు రూ.238.15 కోట్లు చెల్లించినట్టు ఆరోగ్యశ్రీ సీఈవో డా.ఎ.మల్లికార్జున శ‌నివారం విడుద‌ల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న డా.వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద సకాలంలో బిల్లులు ఇస్తున్నామని ఫ‌లితంగా ఆరోగ్యశ్రీ సేవలు పటిష్టంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. రూ.238.15 కోట్ల సొమ్మును రెండు దఫాలుగా వారి ఖాతాలకు జమచేసినట్టు సీఈవో తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తున్నట్టు వెల్ల‌డించారు.

Just In...