Published On: Mon, Dec 3rd, 2018

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల మార్చి కోటా విడుదల

* ఈ నెల 11న ముహూర్తం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: శ్రీవారి భక్తుల సౌకర్యార్థం 2019 మార్చి నెల‌ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈ నెల 11న టిటిడి విడుదల చేయ‌నుంది. ఐటి అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్‌, ఈ-దర్శన్‌ కౌంటర్లు, పోస్టాఫీసుల్లో ఈ టికెట్లను భక్తులు బుక్‌ చేసుకోవచ్చు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను బుక్‌ చేసుకోవాలని టిటిడి కోరింది.

Just In...