Published On: Thu, May 9th, 2019

రెండు ఏపీ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం

సెల్ఐటి న్యూస్‌, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రెండు కీలక బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్‌ మారిటైమ్‌ బోర్డు బిల్లు 2018, కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (ఏపీ సవరణ) బిల్లు 2018లకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి ఎం.విజయరాజుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రథమ కార్యదర్శి లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ జారీ చేసిన ప్రతులను బుధవారం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ ప్రవీణ్‌ప్రకాశ్‌ మీడియాకు విడుదల చేశారు. మరోవైపు రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకంలో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాల పునరుద్ధరణకు కేంద్రం వాటా తొలి విడతగా రూ.69.84కోట్లు విడుదల చేసినట్లు ప్రవీణ్‌ప్రకాశ్‌ తెలిపారు. ఈ పథకంలో రాష్ట్రానికి రూ.100.42 కోట్లు మంజూరు కాగా రాష్ట్రం 40శాతం భరించాల్సి ఉంటుంది.

Just In...