Published On: Sat, Oct 24th, 2020

రెండు డీఏలు పెండింగ్ జీతాలకు సీ‌ఎం అంగీకారం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రెండు విడతలు డీఏలు చెల్లింపునకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు రాష్ట్ర ఎన్జీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం ఏపీఎన్జీవో సంఘ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఈ మేరకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు బాగా పని చేస్తున్నారని, వారికి కావలసిన సౌకర్యాలను ప్రయోజనాలను తాము  ప్పకుండా
నెరవేరుస్తామని పేర్కొన్నట్లు ఎన్జీవో సంఘం ప్రతినిధులు తెలిపారు. ఉద్యోగులను డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన సీఎం జ‌గన్‌కు ఏపీఎన్జీవో సంఘ రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రెండు డీఎలను నవంబరులోనే చెల్లించనున్నట్లు తెలిపారు.

Just In...