Published On: Mon, Jul 15th, 2019

రెండేళ్లలో పాఠశాలల ముఖచిత్రం మార్చేస్తాం..

* ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రెండేళ్లలో పాఠశాలల ముఖచిత్రాన్ని మార్చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషనలైజేషన్‌ కింద 6 వేలకు పైగా పాఠశాలలను మూసివేశారని, వాటిని ఎందుకు మూసివేశారో పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఏపీ బడ్జెట్‌పై చర్చలో భాగంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన అత్యంత అవసరమన్నారు. టెండర్లపై ధ్యాస తప్ప పారిశుద్ధ్య కార్మికులను గత ప్రభుత్తం ఏమాత్రం పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించామన్నారు. సెర్ప్‌ ద్వారా జీతాలు చెల్లించకపోతే పారిశుద్ధ్య కార్మికులు ఎలా వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో లక్ష మరుగుదొడ్లు పని చేస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి వివరించారు.

Just In...