Published On: Thu, May 21st, 2020

రేపటి నుంచి అధిక ఉష్ణోగ్రతలు…

విశాఖపట్నం, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ వాతావరణ సూచనల ప్రకారం శుక్ర‌వారం నుంచి 25వ తేదీ వరకు నాలుగు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. వివరాలిలా ఉన్నాయి. 22న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45° నుంచి, 47°సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. పశ్చిమగోదావరి, కృష్ణ , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°-44° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°-42° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 23 న విశాఖపట్నం, క్రిష్ణా, గుంటూరు , ప్రకాశం, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46°-48° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం ,తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 43°-45° డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కడప, అనంతపురం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°-42°వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 24 న విజయనగరం , విశాఖపట్నం, క్రిష్ణా , గుంటూరు , ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°-46° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°43° వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం, కడప, అనంతపురం , కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 39°-42°వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 25 న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°-44°ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విజయనగరం , విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, క్రిష్ణా , గుంటూరు , కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 41°-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 38°-39°ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణశాఖ జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ప్రజలు కుడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. వడగాలుల బారిన పడకుండా మహిళలు, పిల్లలు, వృద్దులు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ఓఆర్‌ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని సూచించారు. మంచినీరు ఎక్కువగా తీసుకుంటుండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ సూచించారు.

 

Just In...