Published On: Fri, Apr 3rd, 2020

రైతుబ‌జార్లు, జ‌న‌ర‌ల్ స్టోర్స్‌లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ త‌నిఖీలు…

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం:  క‌రోనా వైర‌స్ నేప‌ధ్యంలో లాక్‌డౌన్ జ‌రుగుతున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని తూనికలు, కొలతల్లో అవకతవకలు జరుగకుండా శాఖాప‌రంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రోజువారీ తనిఖీలలో భాగంగా శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని రైతుబ‌జార్లు, జ‌న‌ర‌ల్ స్టోర్ల‌లో తూనిక‌లు, కొల‌త‌ల శాఖ కంట్రోల‌ర్ డాక్ట‌ర్ యం.కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పటమట హైసూల్ గ్రౌండ్సు నందు ఏర్పాటు చేసిన రైతు బజార్ల దుకాణాల్లో రైతులు ఉపయోగించే తూనిక యంత్రాలు యెక్క ఖచ్చితత్వాన్ని మరియు శాఖాప‌రంగా వేయబడిన ముద్రలను తనిఖీ చేశారు. సదరు తనిఖీలలో, లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము ఎటువంట ఉల్లంఘనలు జరుగుటలేదని గమనించడమైనది. ఈ సందర్భముగా, రైతులు కూరగాయలను విక్రయించే సమయంలో సంబంధిత తూనిక యంత్రము యొక్క రీడింగ్స్ సున్నా (జీరో) స్థాయికి వచ్చిన తర్వతనే తూకము వేయవలెనని రైతులను ఆదేశించారు. వినియోగదారులు కూడా కూరగాయలు మొదలగు వస్తువులు కొనుగోలు చేయునప్పుడు ఈ విషయాన్ని గమనించాల‌ని కోరారు. అలాగే జ‌న‌ర‌ల్ స్టోర్స్‌లోనూ, చౌకధరల దుకాణాల‌ను సందర్శంచి వారు ఉపయోగించే తూనిక యంత్రముల యెక్క ఖచ్చితత్వమును మరియు డిపార్టుమెంటు వారిచే వేయబడిన ముద్రలను తనిఖీ చేసినారు. సదరు తనిఖీలలో, లీగల్ మెట్రాలజీ చట్ట ప్రకారము ఎటువంట ఉల్లంఘనలు జరుగుటలేదని గమనించడమైనది. ఈ సందర్భముగా వినిమోగదారులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నిత్యావసర వస్తువులయెక్క ధరలు, నిర్ణయిత ధరలకన్నా అధిక ధరలకు అమ్మినయెడల మరియు తూనికలు, కొలతలలో మోసాలకు పాల్పడే వ్యాపారస్థులు, చౌకధరల దుకాణపు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. అలగే, ప్యాకేజ్ పాలు మరియు పాల పదార్ధములను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్ర‌యించే వాప్యారుల‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలలో భాగంగా అసిస్టెంట్ కంట్రోలర్-2 యం.యస్.నాయుడు, ఇన్‌స్పెక్టర్ జి.శ్రీకాంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Just In...