Published On: Fri, Jul 9th, 2021

రైతు భ‌రోసా కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

రాయదుర్గం(అనంతపురం జిల్లా), సెల్ఐటి న్యూస్‌: అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైఎస్సార్ రైతు దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి గురువారం రాయదుర్గం నియోజకవర్గంలోని 74- ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ను పరిశీలించారు. వైయస్సార్ ఇంటిగ్రెటెడ్‌ అగ్రిల్యాబ్‌ను ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవశాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, కార్మికశాఖ మంత్రి జి జయరాం, రహదారులు, భవనాలశాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...