Published On: Tue, Aug 29th, 2017

రైలు కింద పడి వ్యక్తి మృతి

సెల్ఐటి న్యూస్‌, గుంటూరు డెస్క్‌: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. బాబాపేట రైల్వేగేటు సమీపంలో వ్యక్తి (35) రైలు కింద పడి మృతి చెందాడు. పట్టాల పక్కన మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం తల భాగం చిద్రమవడంతో గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతుని ఒంటిపై సిమెంటు కలర్‌ షాట్‌ ఉందని, అంతకుమించి ఎలాంటి ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తరలించామన్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

Just In...