Published On: Thu, Nov 29th, 2018

రైలు ఢీకొని యువ‌కుడు దుర్మ‌ర‌ణం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: చెవిలో ఇయ‌ర్ ఫోన్స్ పెట్టుకుని పాట‌లు వింటూ రైలు ప‌ట్టాలు దాతుతూ ఓ యువ‌కుడు బుధ‌వారం మ‌ధ్యాహ్నం విజ‌య‌వాడ మ‌ధురాన‌గ‌ర్ రైల్వేస్టేష‌న్‌లో దుర్మ‌ర‌ణం పాల‌య్యాడు. మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు భ‌ద్రాచ‌లానికి చెందిన ఠాగూర్ (18) ట్రాక్ దాటుతున్న స‌మ‌యంలో రైలు ప్రమాదానికి గుర‌య్యాడు. ట్రాక్‌మెన్ వెంట‌నే ఉన్న‌తాధికారులకి స‌మాచారం ఇచ్చిన‌ప్ప‌టికీ కనీసం మృత‌దేహాన్ని సైతం రైల్వే అధికారులు ప‌క్క‌కు తీయ‌క‌పోవ‌డంతో పాటు ఘ‌ట‌నా స్థ‌లానికి సైతం వ‌చ్చి చూడ‌లేదు. దీంతో రైళ్ల రాక‌పోక‌లు య‌ధావిధిగా మృత‌దేహంపై నుంచే రాక‌పోక‌లు సాగించారు. నాలుగు గంట‌ల స‌మ‌యం దాటినా అధికారులు ఎవ్వ‌రూ రాక‌పోవ‌డంతో స్థానికులు స్పందించి మృత‌దేహాన్ని ట్రాక్ నుండి వేరు చేసే ప్రయత్నం చేశారు. కానీ రైల్వే అధికారులు మాత్రం మృతుడి కుటంబానికి సమాచారం కూడా అందించ‌క‌పోవ‌డం స్థానికంగా ఉండేవారితో పాటు రైల్వే ప్ర‌యాణికుల‌ను సైతం తీవ్ర ఆవేద‌న‌కు గురిచేసింది.

Just In...