Published On: Sat, Apr 14th, 2018

రైలు నుంచి జారి పడి వ్యక్తి దుర్మరణం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ క్రైం: విజయవాడ రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఆర్‌ఆర్‌ఐ వద్ద శుక్రవారం ఒక గుర్తు తెలియని ప్రయాణికుడు రైలు నుంచి జారి పడి మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుని వయస్సు సుమారు 35ఏళ్లు ఉంటాయని 5.5 ఎత్తు, చామనఛాయలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఎరుపురంగు చొక్కా, గ్రీన్‌ రంగు నిక్కరు ధరించాడని ఆధారాలు లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులు విజయవాడ రైల్వేస్టేషన్‌ ఆరో నెంబరు ప్లాట్‌ఫాంపై ఉన్న జీఆర్పీ పోలీస్టేషన్‌లో సంప్రదించాలన్నారు.

Just In...