Published On: Wed, Oct 31st, 2018

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మ‌ర‌ణం..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం చిన్నాపురం దగ్గర బుధ‌వారం మ‌ధ్యాహ్నం లారీ, బైక్ డీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. మొర‌క‌రి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వీరు ముగ్గురూ కళాశాలకు ఓకే బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జ‌రిగింద‌ని పోలీసులు తెలిపారు. మృతులు, క్ష‌త‌గాత్రుడు వాడపాలెం బందరు మండలం, గరువు గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. అతి వేగ‌మే ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని స్థానికులు చెబుతున్నారు.

Just In...