Published On: Sun, Nov 25th, 2018

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అయ్యప్ప భక్తులు దుర్మ‌ర‌ణం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం తాతపూడి గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు లారీని ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అయ్యప్ప భ‌క్తులు దుర్మ‌ర‌ణంపాల‌య్యారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. రాజమ‌హేంద్ర‌వ‌రం ప్రాంతానికి చెందిన ఐదుగురు అయ్య‌ప్ప భ‌క్తులు కారులో శబరిమల వెళ్లి స్వామిని దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి వస్తుండగా చిలకలూరిపేట వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రగాయాల పాలయ్యారు. వారిని చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...