Published On: Mon, Nov 12th, 2018

రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు దుర్మ‌ర‌ణం

సెల్ఐటి న్యూస్‌, క్రైం డెస్క్‌: విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం పేరాపురం వద్ద జాతీయ రహదారిపై సోమ‌వారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. డివైడర్‌ను ఢీకొని కారు బోల్తా ప‌డ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాదంలో మృతి చెందిన ఇద్దరు మహిళలు  శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం దీర్ఘాశి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. బంధువుల‌కు స‌మాచారం ఇచ్చారు.

Just In...