Published On: Tue, May 15th, 2018

రోల్‌మోడ‌ల్‌గా గురుకుల పాఠ‌శాల‌లు

* అందుకు అనుగుణంగా ఉద్యోగులు పని చేయాలి

* మంత్రి నక్కా ఆనంద‌బాబు 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నాన్ టీచింగ్- కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ టైమ్ స్కెల్, ప్రభుత్వ ఉద్యొగులతో సమానంగా గురుకుల ఉద్యోగులకు 2018 పీఆర్సీ వర్తింపచేసేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి న‌క్కా ఆనంద‌బాబు హామీ ఇచ్చారు. వెలగపూడి సచివాలయంలో సోమ‌వారం త‌న ఛాంబ‌ర్‌లో సొషల్ వెల్ఫేర్‌, ట్రైబెల్ వెల్ఫేర్, గురుకుల పాఠ‌శాల‌ల్లో పనిచేస్తున్న ఆల్ ఎంప్లాయిస్ అసొషియేషన్ సభ్యులతో మంత్రి ఆనందబాబు అధ్యక్షతన స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సొషల్ వెల్ఫేర్‌, ట్రైబెల్ వెల్ఫేర్, గురుకుల పాఠ‌శాల‌ల్లో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రక్ట్, ఔట్ సొర్సింగ్ టీచర్స్, నాన్ టీచింగ్, ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను అసొషియేషన్ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. గురుకుల స్కూల్స్‌లో పని చేస్తున్న ఉద్యోగుల స‌మ‌స్య‌ల‌ను 15-20 రోజుల్లో పరిష్కరిస్తానని ఈ సంద‌ర్బంగా మంత్రి ఆనందబాబు  హమీ ఇచ్చారు. హెల్త్ రియబర్స్‌మెంట్ పెండింగ్ చెల్లింపులు 2.25 కోట్లు చెల్లించేందుకు, సి.పిఎస్‌ను వెంటనే వర్తింపచేసేందుకు కూడా ఈ సంద‌ర్భంగా మంత్రి అధికారులకు ఆదేశాలిచ్చారు. చిన్న కారణాలతో ఉద్యోగులను  విధుల నుంచి తొలగించడం భావ్యం కాదని ఉద్యోగులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఆయ‌న సానుకులంగా స్పందించారు. ఉద్యోగుల సర్వీస్ నిబంధ‌నలు మార్పులు చేయటకు కమిటీని నియమిస్తామని, గురుకుల వ్యవస్థ పటిష్టపరిచేందుకు  శాశ్వ‌త పరిష్కారం కోసం కమిటీని నియమించేందుకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం సానుకులంగా ఉంటుంద‌న్నారు. ఉపాద్యాయులు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దెందుకు కృషి చేస్తూ ప్రభుత్వ ఆశయాల‌ను నెరవేర్చాలని ఈ సంద‌ర్భంగా మంత్రి వారికి సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రమణ్యం, ఎఎస్ రామకృష్ణ, గాదే శ్రీనివాసులు నాయుడు, కత్తి నరసింహరెడ్డి, రామ్‌సూర్యరావు, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి గంధం చంద్రుడు, సాంఘీక సంక్షేమ గురుకుల కార్యదర్శి కె.రాములు, ఉద్యోగ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Just In...