Published On: Sat, Sep 9th, 2017

ర‌వాణాశాఖ టెక్నిక‌ల్ రాష్ట్ర సంఘ కార్యవర్గం ఎకగ్రీవ ఎన్నిక

* అభినందించిన ఎన్జీవో నేత అశోక్‌బాబు

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: విజ‌య‌వాడ గాంధీన‌గ‌ర్‌లోని ఎ.పి.ఎన్‌.జి.వో హోంలో శనివారం నిర్వహించిన రవాణా శాఖ టెక్నికల్ ఆధికారుల రాష్ట్ర సంఘానికి నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను ఎ.పి. ఎన్జీవో అసోసియేషన్ అధ్యకులు పి.ఆశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, పశ్చిమ కృష్ణా అధ్యకులు ఎ.విద్యాసాగర్‌, రవాణా శాఖ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యకులు రాజారావు, రవాణా శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు రవాణా శాఖ ఆధికారుల, సిబ్బంది సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వానికి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎకగ్రీవంగా ఎన్నికైన నూతన కార్యవర్గం అధ్యకునిగా కె.వి.సుబ్బారావు, సహా అధ్యకునిగా ఆర్.సి.హెచ్ శ్రీనివాన్, టి.కె.పి రెడ్డి, కె.ఎన్.ఎన్.బి.కృష్ణారావు, జి.వి.మాధవరెడ్డి, ఉపాధ్యకులుగా సితాపతిరావు, జె.బాలానాయకి, సి.వాసుదేవరెడ్డి, ఎన్.ఎస్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా కె.సీతారామిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.ప్రవీణ్‌కుమార్, డి.ఎస్.ఎం.వరప్రసాద్, ఆర్.రాజేంద్రప్రసాద్, జాయింట్ సెక్రటరీలుగా కె.యస్.దీప్తి, ఎస్.వెంకటరావు, టి.క్రాంతికుమార్, ఎం.రవికుమార్, టి.రామవరావు, సలహాదారులుగా సి.హెచ్ సంపత్‌కుమార్‌, ఎ.హెచ్.ఖాన్, టెక్నికల్ కమీటి సభ్యులుగా బాలమురళీకృష్ణ, ఎం.శశికుమార్, సి.వి.రమణ, ఐ.సాయినాదు ఎకగ్రీవంగా ఎన్నికైన‌ట్లు ఎన్నికల అధికారి ఎం.డి.ఇక్బాల్, సహాయ ఎన్నికల అధికారి పి.రాజశేఖర్ ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియను మణికుమార్ పర్యవేక్షించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యుల చేత ఎన్నికల అధికారి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు.

transport_department_oath_cermony_1

Just In...