Published On: Thu, Mar 26th, 2020

లాక్‌డౌన్ పూర్త‌య్యేవ‌ర‌కూ ప్రజలందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలి..

* రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ విజ్ఞ‌ప్తి

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్రంలోని ప్రజలందరూ ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపి సీఎం వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి సూచించారు. ఎక్కడివారు అక్కడే ఉండిపోతేనే క‌రోనా వైరస్‌ను నిరోధించగలమని చెప్పారు. గురువారం సాయంత్రం త‌మ విడిది కార్యాల‌యం నుంచి రాష్ట్ర ప్ర‌జ‌ల‌నుద్దేశించి సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశం మొత్తం అతలాకుతలం అయిపోతుందని భయపడొద్దని పేర్కొన్నారు. కరోనా లాంటి వ్యాధులు వందేళ్లకోసారి కూడా వస్తాయో రావో… అయినా కరోనా లాంటి వ్యాధులను సమర్థంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కరోనాను క్రమశిక్షణతోనే గెలవగలమని చెప్పారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందేనని, కరోనాపై చర్యలకు ప్రజలంతా సహకరించాలని సీఎం కోరారు. రాత్రి తెలంగాణ బోర్డర్‌లో చాలా మంది నిలిచిపోయారని, వారిని మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించలేని పరిస్థితి ఉందన్నారు. ఏప్రిల్‌ 14వరకు ఎక్కడివాళ్లు అక్కడే ఉండగలిగితే కరోనా కాంటాక్ట్ కేసులను గుర్తించగలుగుతామన్నారు. తిరగడం మొదలు పెడితే గుర్తించడం కష్టం అవుతుందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.  ‘‘ఏపీకి వచ్చినవారందరినీ క్వారంటైన్‌కు తరలించకతప్పదు. టెస్టులు చేయించుకున్న తర్వాతే స్వస్థలాలకు వెళ్లాలి. సీఎం కేసీఆర్‌తో మాట్లాడా, సానుకూలంగా స్పందించారు. భోజనం, వసతి కల్పిస్తామని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ఎక్కడ చిక్కుకున్న వారైనా కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే… కేంద్రం వారికి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తుంది. ఏపీలో ఇప్పటివరకు కేవలం 10 కేసులే నమోదయ్యాయి. కేసులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చినవారిపై నిఘా ఉంచాం. విదేశాల నుంచి రాష్ట్రానికి 27,818మంది వచ్చారు’’ అని జగన్ తెలిపారు. జాగ్రత్తగా ఉంటేనే వైరస్ వ్యాప్తి అరికట్టడం సాధ్యం. మూడు వారాలు ప్రయాణాలు ఆపేయండి.
రాష్ట్రంలో 10 పాజిటీవ్ కేసులు నమోదు. చాలా జాగ్రత్తగా ఉంటేనే వ్యాప్తిని అరికట్టగలం. బయటి దేశాల నుండి వచ్చిన వారు దాదాపు 27819 మంది అని సర్వేలో తేలింది. గ్రామస్థాయిలో ఉన్న సెక్రటేరియట్, వాలంటీర్లు, ఆశాల సేవలు అభినందనీయం. స్వీయ క్రమశిక్షణ చాలా అవసరం. 80.9శాతం ఇళ్లల్లో ఉంటే తగ్గిపోతుంది. 14శాతం హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వస్తుంది. 4.9శాతం ఐసీయూ లోకి వెళ్ళాల్సివస్తుంది. బిపి, షుగర్, కిడ్న్నీ రోగులకు బాగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది..కావున పెద్దవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రులు సిద్ధంగా ఉంచాము క్వరంతాయిన్ కోసం. ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా వృథా. 1902 హెల్ప్ లైన్ ను వాడుకుని ప్రజలు సేవాలుపొందవచ్చు. 104 కూడా అందుబాటులో వుంది. రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ సర్వే చెయ్యమని వాలంటీర్లకు ఆదేశాలు ఇచ్చాం. ఫారీన్ రిటర్న్లు ఉంటే గుర్తించి, వారిని పరీక్షలు చెయ్యాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు సిబ్బంది, కలెక్టర్లు, వైద్యారోగ్య సిబ్బంది 24/7 అందుబాటులో వున్నారు. 4 చోట్ల క్రిటికల్ కేర్ ఆసుపత్రులు ఏర్పాటు చేసాం. నిత్యావసర వస్తువుల వాహనాలకు ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. వస్తువుల కొరత రానివ్వం. ప్రతి 2, 3 కిలోమీటర్ల పరిధిలోకి రైతుబజార్లు అందుబాటులోకి తెచ్చాం. ఉదయం 6 నుండి 1గంట‌ వరకు బయటకు రండి. అనవసరంగా బయట తిరగవద్దు. గ్రామాల్లో రైతులు తప్పని పరిస్థితుల్లోనే బయటకి రండి….1-2 మీటర్ల దూరం పాటించండి. గ్రామాల్లో పారిశుధ్య పనులను పంచాయతీరాజ్ శాఖ దృష్టి పెట్టాలని, నగరాల్లో మునిసిపల్ అధికారులను ఆదేశించాము. 29 నాటికి బియ్యం, పప్పు అందుబాటులోకి తెస్తాం. ఏప్రిల్ 4 నాటికి రూ.వెయ్యి ఇంటికే పంపిస్తాం. పోలీసులు, డాక్టర్లు, నర్సులు చాలా శ్రద్ధతో సేవాలందిస్తున్నారు. బాధ్యతతో వ్యవహరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వైరస్ తీవ్రత పెరుగుతుంది.  పరిస్థితి చెయ్యి దాటిపోతుంది. అందుకే ఎక్కడివాళ్ళు అక్కడే ఉండండి. తెలంగాణాలో ఉన్న ఏపీ ప్రజల సంక్షేమం తెలంగాణా సీఎం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెంద‌వ‌ద్ద‌ని పేర్కొన్నారు.

Just In...