Published On: Mon, Mar 23rd, 2020

లాక్‌డౌన్.. భ‌వానీపురంలో పీఎస్ ప‌రిధిలో ప్ర‌త్యేక చెక్‌పోస్ట్‌లు..

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌ధ్యంలో కృష్ణా జిల్లా ప‌రిధిలో లాక్‌డౌన్ విధించిన సంగ‌తి విధిత‌మే. అందులో భాగంగా విజ‌య‌వాడ న‌గ‌రంలోనూ ప్ర‌జ‌ల శ్రేయ‌స్సును దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి ఆయా పోలీస్‌స్టేష‌న్ల సీఐలు త‌మ ప‌రిధిలో ప్ర‌త్యేక చెక్‌పోస్టులు, పికెట్లు ఏర్పాటు చేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని గ‌ట్టువెనుక ప్రాంత‌మైన భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ నిర్వ‌హిస్తున్నారు. మూడు ప్రదేశాలలో చెక్ పోస్ట్‌లు, ఐదు ప్రదేశాలలో పికెట్లు మరియు మూడు మొబైల్ పార్టీలు ఏర్పాటు చేశారు. భ‌వానీపురం మ‌రియు గొల్లపూడి గ్రామ ప్రజలకు భవానీపురం పోలీసులు ప్ర‌త్యేక హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం విజయవాడ నగర పరిధిలో అలానే కృష్ణ జిల్లా పరిధిలో ఈ నెల 31 వ తారీకు వరకు లాక్ డౌన్ ఉత్తర్వులు అమలులో ఉన్నందున.. ప్రజలందరూ ఈ క్రింద విషయాలు గుర్తించుకోవాలి..మిల్క్ బూత్స్ మరియు వెజిటల్ షాప్స్ కేవలం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు మాత్రమే ప్రజా అవసరాల నిమిత్తం తెరిచిఉంచాలి…ఎట్టి పరిస్థితులలో ఉదయం 9 దాటినా తరువాత ఏ దుకాణం తెరిచిఉంచరాదు … కేవలం మెడికల్ షాప్స్ మాత్రమే తెరిచిఉంచాలి …అన్ని సూపర్ బజార్లు మరియు అన్ని రకాల దుకాణాలు ఎట్టి పరిస్థితులలో తెరువరాదు. మిల్క్ బూత్స్ ఉదయం 4 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. బట్టల షాప్స్ హోటల్స్ బార్ & రెస్టాయూరాంట్స్ రెస్టాయూరాంట్స్ టీ షాప్స్ కాఫీ షాప్స్ నూనె దుకాణాలు గొల్లపూడి కమర్షియల్ కాంప్లెక్స్ దుకాణాలు ఐరన్ యార్డ్ లో దుకాణాలు కచ్చితంగా మూసివేయాలి.ఎవరైనా పై ఉత్తర్వులు ఉల్లఘించి దుకాణాలు తెరిచినలేదా సరైన కారణం లేకుండా వాహనాలపై తిరిగినా చట్ట ప్రకారం కఠిన చర్యలు చేప‌డ‌తామ‌ని భ‌వానీపురం సీఐ మోహ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు. త‌మ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంద‌న్నారు. మంగ‌ళ‌వారం నుండి ప్రతి రోజు ఉదయం 6 నుంచి 9 వరకు నిత్యావసరాల కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చామ‌న్నారు. రాత్రి 7 నుంచి ఉదయం 6 వరకు పూర్తిగా షట్ డౌన్ ఉంటుంద‌ని తెలిపారు. ఉదయం 6 నుంచి 9 వరకు కిరాణా షాప్స్, రైతు బజార్లు అనుమతిస్తామ‌న్నారు.అలాగే ఉదయం 5 నుంచి 9 వరకు ఏటీఎం వాహనాలకు, ప్రభుత్వ సర్వీసు వాహనాలకు మాత్రం 24 గంటల అనుమతి ఇస్తామ‌ని తెలిపారు. కుటుంబం నుంచి ఒకరు మాత్రమే బయటకు వచ్చి కొనుగోలు చేయాల‌న్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

Just In...