Published On: Mon, Jul 5th, 2021

లారీని ఢీకొన్న కారు, వెనక నుండి కారుని బలంగా ఢీ కొట్టిన లారీ..

* ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మ‌ర‌ణం

* తిరుపతి నుండి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం

గూడూరు(నెల్లూరు జిల్లా), సెల్ఐటి న్యూస్‌: నెల్లూరు జిల్లా గూడూరు స‌మీపంలో ఆదివారం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాధాన్ని నింపింది. ఈ ప్ర‌మాదంలో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృత్యువాత ప‌డ‌గా మ‌రొక‌రు తీవ్ర గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రాథమిక సమాచారం మేరకు.. గూడూరు రూరల్ పరిధిలో ఆదిశంకరా ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్న కారణంగా వాహన దారులకు సింగిల్ రోడ్డు అందుబాటులో ఉంది, ఈ సింగిల్ రోడ్ చివరన వేగ నియంత్రణ కొరకు స్పీడ్ బ్రేకర్ వేసి వున్నారు,ఈ స్పీడ్ బ్రేకర్ వద్ద ముందు వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడం తో కార్ డ్రైవర్ కూడా బ్రేక్ వేయడం అప్పటికే కార్ లారీ వెనక భాగంలో గుద్దుకోవడం ఈ లోపు వెనక వస్తున్న ఇంకో లారీ బలంగా కార్ ని వెనక నుండి ఢీ కొట్టడంతో కార్ రెండు లారీలు మధ్య నుజ్జు నుజ్జు అయిపోయి కార్ లో ప్రయాణిస్తున్న 5మందిలో నలుగురు స్పాట్ లోనే చనిపోయినట్టు ఈ ప్రమాదంలో కార్ లోని వారు కూడా నుజ్జు నుజ్జు అయి వారిని బయట తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని దీన్ని బట్టి ఈ సంఘటన ప్రమాద తీవ్రతని తెలియచేస్తుంది. ప్రమాదంలో మరణించి వారి అడ్రెస్.. ఇన్నీస్‌పేట, మొల్లవారి వీధి, రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Just In...