Published On: Tue, Dec 4th, 2018

లీగల్ ఒపీనియన్ పేరుతో ఇళ్ల లబ్దిదారులను ఇబ్బంది పెట్టవద్దు

* ఇళ్ల నిర్మాణంపై టెలికాన్ఫరెన్స్‌లో ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ‘‘పట్టణాల్లో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి. ఇళ్ల లబ్దిదారుల ఎంపిక వారం రోజుల్లో పూర్తిచేయాలి. అన్ని ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి. అప్పుడే మనకు కొత్తగా మరిన్ని ఇళ్లు మంజూరు అవుతాయి’’ అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ‌ పేర్కొన్నారు. ‘పట్టణ లబ్దిదారులను లీగల్ ఒపీనియన్ పేరుతో ఇబ్బందులు పెట్టవద్దు. పేదల ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టుకు బ్యాంకర్లు సహకరించాలి. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిరుపేదల ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వమే హౌసింగ్ ప్రాజెక్టుకు డెవలపర్, బ్యాంకర్ ఫైనాన్సియర్. భూములు ప్రభుత్వానివే కాబట్టి లీగల్ ఒపీనియన్ అవసరం ఉండదు. దీనిపై ఎస్.ఎల్. బిసి సమావేశం ఏర్పాటు చేయాలి. లిఖిత పూర్వకంగా బ్యాంకర్లకు ఈ సమాచారం పంపాలి. రుణ మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలి. భూముల మ్యుటేషన్ ప్రక్రియపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్దపెట్టాలి’’ అని ఆదేశించారు. ‘‘రాష్ట్రంలోని పట్టణాలలో పేదలకు 5,24,000 ఇళ్లు మంజూరు కాగా అందులో 3,55,337 ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఈ వారం ఇళ్ల శ్లాబుల లక్ష్యం 11వేలకు గాను 3,247 శ్లాబులు మాత్రమే పడ్డాయి. ఈ వారం ఇళ్ల నిర్మాణం పూర్తి లక్ష్యం 10వేలకు 4,382 పూర్తయ్యాయి. ఇప్పటివరకు 1,10,123 ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయి. త్వరలోనే లక్ష గృహాల సామూహిక గృహ ప్రవేశాలకు అన్నీ సిద్ధం చేయాలి’’ అని సూచించారు.
            ‘‘లబ్దిదారుల వాటా చెల్లింపు వేగవంతం చేయాలి. ఈ వారం కేవలం రూ.24కోట్లు మాత్రమే లబ్దిదారుల వాటాగా చెల్లించారంటూ, ఇప్పటివరకు రూ.415.69 కోట్లు చెల్లించినట్లు అయ్యింది. ఈ వారంలో 11,615మంది బ్యాంకు ఖాతాలు తెరిచారంటూ, ఇప్పటివరకు 47,520 మంది బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు అయ్యింది. మిగిలిన వారితో కూడా వెంటనే ఓపెన్ చేయించాలి’’ అని ఆదేశించారు. ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, గ్రవుండ్ కాని ఇళ్లు వెంటనే గ్రవుండ్ చేయాలని సిఎస్ పునేటా పేర్కొన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో మంత్రి డాక్ట‌ర్ పి.నారాయణ, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ఎండి కాంతిలాల్ దండే, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

Just In...