Published On: Fri, Sep 27th, 2019

లైంగిక వేధింపులు తాళ‌లేక మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

* శ్రీకాకుళం జిల్లాలో దారుణం

సెల్ఐటి న్యూస్‌, శ్రీకాకుళం: జిల్లాలోని కంచిలి మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్‌లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ మాధవ్ లైంగిక వేధింపులు తాళలేక శైలజ అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త స్థానిక ఏపీజీవీ (ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్) బ్యాంక్‌లో ఫీల్డ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ప్రక్కింట్లో అద్దెకు ఉంటున్న మాధవ్ అనే వ్యక్తి వేధింపులే వల్లె ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఆమె బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా మాధవ్ మొబైల్‌లో చిత్రీకరించి లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా తెలియవచ్చింది. తన కోరిక తీర్చకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరించినట్లుగా సమాచారం. దీంతో ఆమె తన భర్తకు చెప్పుకోలేక మనస్థాపానికి గురై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

Just In...